News January 26, 2025
‘హథిరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం’

ప్రాణాలను అడ్డుగా పెట్టి తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠాన్ని కాపాడుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మఠాన్ని శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు పరిశీలించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. మఠం భవనాల కూల్చివేతతో రూ.కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.
Similar News
News February 13, 2025
NRPT: ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

భేటీ బచావో భేటీ పఢావో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథాన్ని గురువారం నారాయణపేట కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వం, బాలిక విద్యపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. బాలికల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
News February 13, 2025
NCA జిమ్‌లో బుమ్రా.. ఫొటో వైరల్

వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా బెంగళూరు NCAలో పునరావాసం పొందుతున్నారు. తాజాగా జిమ్‌లో ఉన్న ఫొటోను ఈ స్టార్ బౌలర్ షేర్ చేస్తూ ‘రీబిల్డింగ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరలవుతోంది. త్వరగా కోలుకుని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ CTకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
News February 13, 2025
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు. విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్‌ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు.