News April 28, 2024
హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర నేడు హనుమకొండకి చేరనుంది. సాయంత్రం 6 గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. అనంతరం హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగిస్తారు. సమావేశం అనంతరం రాత్రి మాజీ ఎంపీ కెప్టెన్ వొడితల లక్ష్మీ కాంతారావు నివాసంలో బస చేస్తారు.
Similar News
News November 8, 2024
4వ డివిజన్ కన్వీనర్‌గా సురేందర్
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పనికలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ డివిజన్ కమిటీని ఈరోజు ఎన్నుకున్నామన్నారు. డివిజన్ కన్వీనర్‌గా సురేందర్, కో -కన్వీనర్లుగా వేల్పుల భిక్షపతి, తోగరి సారంగపాణి, బలిజ పృథ్వీ, రాజ్ కుమార్ తదితరులను ఎన్నుకున్నామని చెప్పారు. అనంతరం గ్రేటర్ కో-కన్వీనర్లు పొనగంటి లక్ష్మినారాయణ, కాళేశ్వరం రామన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.
News November 8, 2024
శబరిమలకు ప్రత్యేక ఏసీ, నాన్ ఏసీ బస్సులు: WGL RM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రీజియన్ నుంచి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం, శబరిమలకు ప్రత్యేక ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ రీజనల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. ప్రయాణికులు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల మీదుగా నడుపుతామని అన్నారు. వీటిలో ఒక గురుస్వామితోపాటు 2 వంటవాళ్లు, 2 మణికంఠ స్వాములు, ఒక అటెండర్ ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు.
News November 8, 2024
యాదగిరి గుట్టలో ఎత్తైన స్వర్ణగోపురం ఉండడం రాష్టానికి గర్వ కారణం: కొండా
దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిదే కావడం రాష్ట్రానికి గర్వకారణమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని దేవాలయాలను పరమ పావన క్షేత్రాలుగా, ప్రశాంత నిలయాలుగా తీర్చిదిద్దేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనపై మంత్రి సమీక్షించారు.