News March 16, 2026

హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.

Similar News

News April 14, 2026

మంత్రి సత్య కుమార్ చొరవ.. ఓ కుటుంబంలో వెలుగులు

image

కదిరికి చెందిన చరణ్ కుమార్ ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్య కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్న చరణ్‌కు మంత్రి చొరవతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. క్లిష్ట సమయంలో స్పందించి ఆర్థికంగా, వైద్యపరంగా సహాయం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు మంత్రికి చరణ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

News April 14, 2026

స్టేట్ అథ్లెటిక్స్‌లో సిద్దిపేట క్రీడాకారుల సత్తా

image

హనుమకొండలో జరిగిన తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 7 పతకాలు సాధించి సత్తా చాటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. ఈనెల 11, 12న జరిగిన పోటీల్లో గణేష్ 10,000 మీటర్ల పరుగులో బంగారు పతకం గెలుచుకున్నారు. అలాగే డెకాథ్లాన్‌లో ఉదయ్ కిరణ్ రజతం, ఆనంద్, రాహుల్, నగేష్‌లు కాంస్య పతకాలు సాధించినట్లు వెల్లడించారు. విజేతలను అభినందించారు.

News April 14, 2026

కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

image

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్‌ తొలగిపోతాయి.