News November 21, 2024

హనుమకొండలో డెడికేటెడ్ కమిషన్ బహిరంగ విచారణ

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఖరారు కోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం బహిరంగ విచారణ చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో చేపట్టిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు బీసీ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.

Similar News

News December 5, 2024

ములుగు: విషమిచ్చి కిరాతకంగా చంపారు: మావోయిస్టు లేఖ

image

ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1వ తేదీన చెల్పాక అడవుల్లోని పూలకమ్మ వాగు వద్ద గ్రేహౌండ్స్ బలగాలు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట లేఖ విడుదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ బందుకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 5, 2024

వరంగల్: క్వింటా తేజ మర్చి ధర రూ.16,000

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.16,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా నేడు రూ.13,500 పడిపోయింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.14,100 ధర రాగా.. నేడు రూ.14,500 కి చేరింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News December 5, 2024

నర్సంపేట అయ్యప్ప దేవాలయంలో కేరళ సంప్రదాయ పూజలు

image

కేరళ సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుగుతూ నర్సంపేటలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకమైనదిగా కొనసాగుతోంది. 24ఏళ్ల క్రితం దాతల సహకారంతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి ఏటా శబరిమలలో అయ్యప్పకు జరిగే విశేష పూజలైన ఉత్సవబలి, క్షేత్రబలి, పల్లివేట, పంబా ఆరాట్‌లనూ ఇక్కడ నిర్వహిస్తున్నారు. పంబా ఆరాట్ వేడుకలకు వివిధ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.