News March 1, 2025
హనుమకొండ: అబార్షన్ కోసం అలా చేయొద్దు: DMHO

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా కార్యాలయంలో శుక్రవారం DMHO అప్పయ్య, అధ్యక్షతన గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వైసరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు పరీక్షల నిమిత్తం, లింగ నిర్ధారణ కోసం, అబార్షన్ కోసం అర్హత లేని వైద్యులను సంప్రదిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమన్నారు. చట్టం ప్రకారం అబార్షన్కి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో అవకాశం కల్పించిందన్నారు.
Similar News
News November 23, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రఘునాథపల్లి: టైర్లు పేలి మినీ డీసీఎం బోల్తా
> జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేసిన కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇందిరమ్మ చీరల పంపిణీ
> రేపటి ప్రజావాణి కార్యక్రమంలో రద్దు
> టీఆర్టీఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
> జనగామలో బాల్య వివాహం నిలిపివేత
News November 23, 2025
సైలెంట్గా iBOMMA రవి..! ఏం చేద్దాం?

నాలుగో రోజు పోలిస్ కస్టడీలోనూ iBOMMA రవి నోరు విప్పలేదని సమాచారం. తన పర్సనల్ విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు తప్ప ఈ వ్యవహారంలో తనతో ఉన్నది ఎవరు? డేటా థెఫ్ట్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రిలేషన్, ఫారిన్ ట్రిప్స్ తదితర అంశాలపై ప్రశ్నిస్తే మౌనంగా ఉన్నాడట. 5 రోజుల కస్టడీ సోమవారం ముగియనుంది. దీంతో మరోసారి కస్టడీకి అడిగితే కోర్టు ఎలా స్పందిస్తుంది? ఏం చేద్దామని అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.
News November 23, 2025
సంగారెడ్డి: సంపులో మృతదేహం లభ్యం.. గుర్తిస్తే చెప్పండి

సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నూతనంగా నిర్మిస్తున్న సంపులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ రాము నాయుడు ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, ఎవరైనా గుర్తిస్తే సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.


