News February 21, 2025

హనుమకొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్‌సైట్!

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. హనుమకొండ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.

Similar News

News November 5, 2025

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు: సమాఖ్య ఛైర్మన్

image

TG: PVT కాలేజీల యాజమాన్యాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన బెదిరిస్తున్నారని సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు ఆరోపించారు. ఆమెను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం 3 రోజులుగా బంద్ కొనసాగుతుండగా చర్చలకు పిలిచి ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని మండిపడ్డారు. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుకు వేసిన కమిటీలో సంబంధం లేని ఇద్దరిని తొలగించాలన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు బంద్ విరమించేది లేదని తేల్చి చెప్పారు.

News November 5, 2025

MNCL: ఈ నెల 9న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు

image

కాసిపేట మండలం సోమగుడెం సింగరేణి మైదానంలో ఈ నెల 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో 9న ఉదయం 9గంటలకు హాజరుకావాలని జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ సూచించారు.

News November 5, 2025

8 కిలోమీటర్లు కాలినడకన గుట్టకు చేరిన కలెక్టర్

image

కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 8 కి.మీ.లు నడిచి చండ్రుగొండ మండలం కనకగిరి (కనకాద్రి) గుట్టపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ బాధ్యత మనదేనన్నారు. గుట్టపై సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల తయారీదారులైన గిరిజనులను ఆయన అభినందించారు.