News February 21, 2025
హనుమకొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్‌సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. హనుమకొండ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News March 23, 2025
ఆదిలాబాద్: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
News March 23, 2025
కరప: భర్త, ఇద్దరు కొడుకులు చనిపోవడంతో మహిళ సూసైడ్

కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన బరగటి లక్ష్మి (59) ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. 2019లో భర్త, 2021లో చిన్న కొడుకు, 2023లో పెద్దకొడుకు, 2024లో అల్లుడు చనిపోయారు. ఆమె ఒంటరిగా వేలంగిలో ఉంటోంది. మనస్తాపం చెంది ఆమె శనివారం తుల్యభాగలో దూకి మరణించిందని ఆమె మనవడు పోతురాజు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని వెలికి తీసి కరప ఎస్ఐ సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 23, 2025
గుంటుపల్లి: యువతి హత్య కేసులో నిందితులు వీరే

గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద 2019లో ప్రేమ జంటపై జరిగిన దాడి చేసి యువతి హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు శుక్రవారం జీవిత ఖైదు విధించారు. ఈ హత్య అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జి.కొండూరుకు చెందిన రాజు, జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య, గంగయ్య, అరిసెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. ఈ కేసును పోక్సో కేసుగా పరిగణించి నలుగురికి జీవిత ఖైదు విధించారు.