News January 10, 2025
హనుమకొండ: ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని హౌజ్‌బుజుర్గ్ గ్రామానికి చెందిన కమలాకర్(37) పరకాల డివిజన్లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా, ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 24, 2025
వరంగల్: చిన్నారి హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

మూడేళ్ల పాప ఫాతిమా సబాను హత్య చేసిన కేసులో నిందితురాలు హజీరా బేగం, ఆమె సహచరుడు సయ్యద్ యూసుఫ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలాగీతాంబ సోమవారం విధించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు అవుతుందని 2022 ఏప్రిల్ 23న ఇద్దరూ కలిసి క్రూరంగా హతమార్చినట్లు సాక్ష్యాధారాలతో రుజువైనందున కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.


