News February 10, 2025

హనుమకొండ: ఐనవోలులో లేగలపై హైనాల దాడి

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధి గరిమెళ్లపల్లి గ్రామంలో రాత్రి హైనాలు దాడి చేసి మూగజీవాలను చంపాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోకి హైనాలు చొరబడి పాకలో ఉన్న లేగలను చంపాయి. శనివారం చర్ల అజయ్ కుమార్ లేగను, ఆదివారం రాత్రి రాజారపు పోశాలు పాకలో ఉన్న లేగలపై దాడి చేసి చంపాయిని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News November 20, 2025

కృష్ణా: ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్‌లకు పదోన్నతి లభించింది. పలు మండలాల్లో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ అరుణ, ఏఓ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

NGKL: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా సవరణ, తుది ప్రచురణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్షించారు.

News November 20, 2025

ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్‌ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.