News February 10, 2025
హనుమకొండ: ఐనవోలులో లేగలపై హైనాల దాడి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పరిధి గరిమెళ్లపల్లి గ్రామంలో రాత్రి హైనాలు దాడి చేసి మూగజీవాలను చంపాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గ్రామంలోకి హైనాలు చొరబడి పాకలో ఉన్న లేగలను చంపాయి. శనివారం చర్ల అజయ్ కుమార్ లేగను, ఆదివారం రాత్రి రాజారపు పోశాలు పాకలో ఉన్న లేగలపై దాడి చేసి చంపాయిని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 8, 2025
వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
News December 8, 2025
పోలింగ్ రోజున వరంగల్లో స్థానిక సెలవులు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
News December 8, 2025
వ్యవసాయ శాఖపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

వరంగల్ కలెక్టరేట్లో వ్యవసాయ శాఖపై కలెక్టర్ డా.సత్య శారద సమీక్ష నిర్వహించారు. యాసంగి 2025-26కి అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.


