News September 27, 2024

హనుమకొండ క్రీడాకారుడిని సన్మానించిన సీఎం

image

ఇటీవల యూరప్‌లో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించిన హనుమకొండ జిల్లాకు చెందిన ఏరిగేసి అర్జున్ కుమార్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రపంచ స్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారని క్రీడాకారులను ఉద్దేశించి సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News October 9, 2024

గ్రూప్1 పరీక్షలు నేపథ్యంలో కేయూలో పరీక్షలు వాయిదా

image

అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కావాల్సిన కాకతీయ యూనివర్సిటీ LLB రెండో సెమిస్టర్, LLB (ఐదు సంవత్సరాలు) 2వ, 6వ సెమిస్టర్, LLM 2వ సెమిస్టర్ పరీక్షలను TGPSC గ్రూప్ 1 పరీక్షల నేపథ్యంలో వాయిదా వేస్తునట్టు, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహచారి, అదనపు పరిక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బి.నాగరాజు తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడూ నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News October 9, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: సీఈఓ నాగిరెడ్డి

image

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పన పై మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి నాగిరెడ్డి, MHBD జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి MDK- NZBD- ADLD- KNR జిల్లాల ఉపాధ్యాయులు, పట్టభద్రుల MLC స్థానాలు, WGL- KMM -NLG జిల్లాలో ఉపాధ్యాయుల MLC ఖాళీ కానున్నది. వీటి భర్తీ కోసం ఓటరు జాబితా రూపకల్పన చేపట్టాలని ఆదేశించారు.

News October 8, 2024

బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మంత్రి సురేఖ

image

ఆలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సురేఖకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి చర్చించారు. స్థానిక నేతలు పాల్గొన్నారు.