News March 14, 2025
హనుమకొండ: చెడుపై విజయమే హోలీ: కలెక్టర్

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెడుపై విజయమే హోలీ అర్థం అన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధి: కలెక్టర్

గ్రామాలు, పట్టణాల అభివృద్ధే దేశ అభివృద్ధికి పునాది అని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, పరిశుభ్రత, పెన్షన్లు, ఉపాధి హామీ, పాఠశాలల పర్యవేక్షణపై అధికారులు సూచనలు ఇచ్చారు.
News March 13, 2026
భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.
News March 13, 2026
అన్నమయ్య జిల్లా రైతులకు రూ.108.37 కోట్లు జమ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నమయ్య జిల్లాలోని 1,88,408 మంది రైతులకు 3వ విడత అన్నదాత సుఖీభవ, PM కిసాన్ నగదు రూ.108.37 కోట్లు విడుదల చేసిందని JD శివనారాయణ తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని బీడీఎస్ ఫంక్షన్ హాల్, ములకలదిన్నె క్రాస్, పుంగనూరు రోడ్డు, మదనపల్లెలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పంపిణీ జరగనుందన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


