News January 23, 2025
హనుమకొండ జిల్లాలో క్రైమ్ న్యూస్..

> HNK: సుబేదారిలో ఆటో డ్రైవర్ హత్య.. నిందితుడి అరెస్ట్
> HNK: చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగ అరెస్ట్..
> PKL: ఎక్సైజ్ దాడుల్లో 40 లీటర్ల గుడుంబా స్వాధీనం
> PKL: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: CI
> HNK: వారం క్రితమే కత్తిని కొన్నాడు.. నిన్న హత్య
> HNK: రోడ్డు భద్రత నియమాల పట్ల అవగాహన సదస్సు
Similar News
News September 18, 2025
ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్పై లుక్కేయండి!

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.
News September 18, 2025
సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 18, 2025
నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ మధ్య బుధవారం జరిగింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైలు పట్టాలపై డెడ్ బాడీ దొరికింది. డోర్ వద్ద కూర్చొని రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మెరూన్ రంగు ఆఫ్ టీషర్ట్, బ్లూ రంగు షార్ట్ ధరించాడు. ఎస్సై హరి చందన కేసు నమోదు చేశారు.