News January 23, 2025
హనుమకొండ జిల్లాలో క్రైమ్ న్యూస్..

> HNK: సుబేదారిలో ఆటో డ్రైవర్ హత్య.. నిందితుడి అరెస్ట్
> HNK: చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగ అరెస్ట్..
> PKL: ఎక్సైజ్ దాడుల్లో 40 లీటర్ల గుడుంబా స్వాధీనం
> PKL: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: CI
> HNK: వారం క్రితమే కత్తిని కొన్నాడు.. నిన్న హత్య
> HNK: రోడ్డు భద్రత నియమాల పట్ల అవగాహన సదస్సు
Similar News
News February 19, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

న్యాల్కల్ మండలం హుసేల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ తెలిపిన వివరాలు.. హుసేల్లి శివారులోని చెక్ పోస్టు వద్ద ఓ వ్యక్తి రాత్రి సమయంలో నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే హద్నూర్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
News February 19, 2025
ADB: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
News February 19, 2025
27న ప.గో జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.