News March 21, 2025
హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించాలి
✓ ACBకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
✓ ముల్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
✓ HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వ్యక్తి మృతి
✓ HNK: అక్రమ రవాణాపై బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన
✓ ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన దామెర పోలీసులు
Similar News
News March 31, 2025
భూకంపం.. మసీదులు కూలి 700 మంది మృతి

గత శుక్రవారం మయన్మార్లో వచ్చిన భూకంపానికి మసీదులు కూలి ప్రార్థనలు చేస్తున్న 700 మందికి పైగా మరణించారని ఓ ముస్లిం సంఘ ప్రతినిధులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సుమారు 60 మసీదులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత మసీదు భవనాలపై ఎక్కువ ప్రభావం పడిందని వివరించారు. కాగా, ఆ దేశంలో మొత్తం భూకంపం మృతుల సంఖ్య 1700 దాటింది.
News March 31, 2025
తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.
News March 31, 2025
ORRపై టోల్ ఛార్జీల పెంపు

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై టోల్ ఛార్జీలను పెంచేశారు. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు KMకు 10 పైసలు, మినీ బస్, ఎల్సీవీలకు KMకు 20 పైసలు, 2 యాక్సిల్ బస్సులకు 31 పైసలు, భారీ వాహనాలకు 69 పైసల చొప్పున పెంచింది. ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.