News February 27, 2025
హనుమకొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

✓ HNK: ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి హరీశ్ రావు
✓ MLC ఎన్నికలను విజయవంతం చేద్దాం: CP
✓ HNK: ఎన్నికల పోలింగ్ మెటీరియల్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
✓ బంగారు ఆభరణాలతో జాగ్రత్తగా ఉండాలి: HNK ACP
✓ హైదరాబాదుకు దీటుగా వరంగల్ అభివృద్ధి: MP కడియం కావ్య
✓ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సెంట్రల్ జోన్ డీసీపీ
Similar News
News November 18, 2025
రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
News November 18, 2025
కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.
News November 18, 2025
సిరిసిల్లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రాజన్న జిల్లా జిన్నింగ్ మిల్ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ప్రతి మిల్లులో పత్తి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించాలనే ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు మిల్లర్ల అసోసియేషన్ తెలిపింది. దీంతో జిల్లాలో మంగళవారం సాయంత్రం పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.


