News March 11, 2025

హనుమకొండ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

హనుమకొండ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News December 1, 2025

జనగామ: ఎన్నికల్లో కొత్త మోకాలు: సీనియర్ల ఆవేదన

image

జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నో రోజులుగా పార్టీలో కష్టపడిన వారిని కాదని, ఎన్నికల సమయంలో కొత్తగా వచ్చి పదవులను గద్దల్లా ఎత్తుకెళ్తున్నారనే తీరులో కొన్నిచోట్ల వాతావరణం కనిపిస్తోంది. ఎంతో కాలంగా పార్టీలో ఉన్న వారికే సముచిత అవకాశం కల్పిస్తే బాగుంటుందని సీనియర్ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

News December 1, 2025

రాజధాని జిల్లాగా మారుతున్న పల్నాడు.!

image

అమరావతి విస్తరణతో పల్నాడు జిల్లా రాజధాని జిల్లాగా మారనుంది. రెండో విడతలో అమరావతి మండలంలోని పెద్దమద్దూరు, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల నుంచి భూసమీకరణ చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద రైల్వే స్టేషన్, బుల్లెట్ ట్రైన్, గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే జిల్లా మీదుగా వెళ్లనున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధిలో కీలక మలుపు తిరగనుంది.

News December 1, 2025

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

image

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్‌మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/