News March 11, 2025

హనుమకొండ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

హనుమకొండ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News March 26, 2025

గుంటూరు: రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్‌గా నూతలపాటి సౌమ్య

image

గుంటూరులోని కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నూతలపాటి సౌమ్య, రాష్ట్ర జీఎస్టీ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులయ్యారు. మంగళవారం స్టేట్ ట్యాక్సెస్ (జీఎస్టీ) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సౌమ్య సీనియర్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక హోదాతో ఆమె మూడేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ శాఖలో పనిచేస్తారు.

News March 26, 2025

భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

image

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్‌ను గోషామహల్‌ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.

error: Content is protected !!