News February 13, 2025

హనుమకొండ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News September 16, 2025

హుస్నాబాద్: రజకుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

రజక వృత్తిదారుల సమస్యలు CM దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రజక అభివృద్ధి దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుల వృత్తులపై ఆధారపడే బలహీన వర్గాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

News September 16, 2025

రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్‌లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

News September 16, 2025

ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఆక్వా జూన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకురావడానికి భీమవరం, ఆకివీడు మండలాల నివేదికలు అందాల్సి ఉందని, మిగతా అన్ని మండలాల్లో సర్వేను పూర్తి చేసి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు.