News March 5, 2025
హనుమకొండ జిల్లాలో మండుతున్న ఎండ

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 35 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.
Similar News
News January 22, 2026
HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్‌ను సీఎం రేవంత్ దావోస్‌లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్‌ను అధ్యయనం చేస్తామని తెలిపారు.
News January 22, 2026
నరసరావుపేట: ఇంటర్ పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జిరాక్స్ సెంటర్ల మూసివేత, పోలీస్ బందోబస్తు, ఫ్లైయింగ్ స్క్వాడ్లు, వైద్య శిబిరాలు, తాగునీరు, విద్యుత్, బస్సుల ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయని DIEO నీలావతి దేవి తెలిపారు.
News January 22, 2026
కడప: ‘ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లపై పర్యవేక్షణ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని, ఇసుక రీచులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, నూతన ఇసుక రీచ్‌ల గుర్తింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు.


