News February 27, 2025
హనుమకొండ జిల్లాలో మహాశివరాత్రి అప్డేట్స్

✓ వేయి స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
✓ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. Way2Newsతో ఛైర్మన్, అర్చకులు
✓ ఐనవోలు ఆలయంలో భక్తుల సందడి
✓ వంగర: శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
✓ HNK: హయగ్రీవ చారి మైదానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు
✓ HNK: పెళ్లికొడుకు రూపంలో దర్శనమిస్తున్న రుద్రేశ్వర స్వామి
Similar News
News February 27, 2025
కన్నప్ప మూవీ కొత్త పోస్టర్ విడుదల

కన్నప్ప చిత్రం విడుదల తర్వాత శివుడి గురించి ఎవరు ఆలోచించినా అక్షయ్ కుమార్ రూపమే దర్శనమిస్తుందని నటుడు మంచు విష్ణు అన్నారు. కన్నప్ప హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉండనున్నాయో ఈ పోస్టర్లో దర్శనమిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ మార్చి1న విడుదల అవుతుండగా ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
News February 27, 2025
CT: గెలుపు రుచి ఎరుగని పాకిస్థాన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ ఒక్క విజయం కూడా లేకుండా తమ జర్నీ ముగించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ICC టోర్నీ నిర్వహిస్తున్న పాక్ గెలుపు రుచి చూడకుండానే నిష్క్రమించింది. న్యూజిలాండ్, భారత్తో జరిగిన మ్యాచుల్లో ఘోర ఓటమిపాలై, బంగ్లాతో జరగాల్సిన మ్యాచు వర్షం కారణంగా రద్దైంది. పాక్ తలరాతను చూసి ఆ దేశ అభిమానులు నిట్టూరుస్తున్నారు. కప్ కాదు కదా ఒక్క మ్యాచ్ కూడా విన్ కాలేదంటూ వాపోతున్నారు.
News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 96.19% పోలింగ్

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 96.19 శాతం పోలింగ్ నమోదయింది. చీడికాడ, మాకవరపాలెం, రోలుగుంట, ఎస్.రాయవరం మండలాల్లో శతశాతం పోలింగ్ నమోదయింది. దేవరాపల్లిలో 98.41%, మాడుగులలో 96.36%, గొలుగొండలో 95.12%, రావికమతం 98.08 శాతం, బుచ్చయ్యపేటలో 97.06 %, చోడవరంలో 96.73%, కే.కోటపాడులో 95.33%, నర్సీపట్నంలో 95.20%, నాతవరంలో 97.18% పోలింగ్ నమోదయింది.