News March 8, 2025
హనుమకొండ జిల్లాలో MURDER.. కారణం ఇదే..!

హనుమకొండ(D),ఎల్కతుర్తి(M), వీరనారాయణ గ్రామంలో తల్లి రేవతిని <<15683962>>కొడుకు చంపిన<<>> విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కుమారస్వామి,రేవతి(40) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు అజయ్(23) 2ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి 15ఏళ్ల క్రితం చనిపోగా తల్లి పెద్దకొడుకు వద్ద ఉంది. రాత్రి తాగొచ్చిన అజయ్ తల్లిని గొడ్డలితో నరికి చంపాడు.
Similar News
News March 19, 2025
NRPT: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నారాయణపేట మండలం జలాల్‌పూర్ గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 19, 2025
గుర్ల: పాము కాటుతో ఇంటర్ విద్యార్ధిని మృతి

పాము కాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఫకీర్ కిట్టలి పంచాయతీ బూర్లే పేటలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ద్వారపూడి మౌనిక అనే విద్యార్థినికి అర్ధరాత్రి ఇంటివద్దనే నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 19, 2025
ఇంకోసారి అలా అనొద్దు.. ABDకి కోహ్లీ సూచన

ఐపీఎల్-2025కి ముందు ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఈసాల కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) నినాదాన్ని ఇకపై పబ్లిక్‌లో వాడొద్దని కోహ్లీ తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ‘వరల్డ్ కప్‌ను ఈజీగా గెలవచ్చేమో కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత సులభం కాదు. ఈ టోర్నీ చాలా కఠినతరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2011-21 మధ్య ABD ఆర్సీబీకి ఆడిన సంగతి తెలిసిందే.