News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి << 15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు.ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News March 23, 2025

షాద్‌నగర్‌లో హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

image

షాద్‌నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్‌ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News March 23, 2025

SRHvRR: టాస్ గెలిచిన RR

image

ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో SRH ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.

News March 23, 2025

త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి: సత్యకుమార్ యాదవ్

image

AP: బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘<<15850475>>బలభద్రపురం<<>>లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వెళ్లి వైద్యులు సర్వే చేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం. త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తూ.గో జిల్లా బిక్కవోలు(M) బలభద్రపురంలో 200 మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.

error: Content is protected !!