News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 1, 2025

ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో గండం

image

ట్రంప్ ఆంక్షలతో కకావికలమవుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు మరో గండం వచ్చి పడింది. ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుందామనుకుంటే అక్కడా లోకల్ నినాదం స్టార్టైంది. అక్కడి HEIల్లో 50%కి పైగా అడ్మిషన్లు ఆస్ట్రేలియన్లకే ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ మంత్రి జేసన్ క్లార్ ఆదేశించారు. సిడ్నీ వర్సిటీలో 51% మర్దోక్‌లో 57% RMITలో 50% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. దీంతో లోకల్స్‌కు అవకాశం దక్కేలా కోటా విధించారు.

News November 1, 2025

సంగారెడ్డి: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2025 జాబితాను 4 కేటగిరీలుగా విభజించినట్లు చెప్పారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేసే మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు.

News November 1, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోనీ ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఆ వివరాలను మండల విద్యాధికారుల ద్వారా జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.