News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 3, 2026
హైకోర్టులో కేసు వేసిన వేదిక్ యూనివర్సిటీ VC

TTD శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ రాణి సదాశివమూర్తి హైకోర్టులో ‘WRIT PETITION’ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎక్స్ అఫిషియో సెక్రటరీ, TTD, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను అందులో ప్రతివాదులుగా చేర్చారు. VC పదవికి ఆయన అనర్హుడని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయనను తొలగించాలని TTD పాలకమండలి నిర్ణయించింది. TTD బోర్డు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
News January 3, 2026
కరీంనగర్: డీజేలు, డ్రోన్లపై నిషేధం పొడిగింపు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, డ్రోన్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శబ్ద కాలుష్యం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్ సెట్ల వినియోగానికి సంబంధిత ఏసీపీల అనుమతి పొందాలని ఆయన సూచించారు.
News January 3, 2026
రాజమండ్రిలో ‘మన శంకర వరప్రసాద్’ మూవీ సంబరాలు

రాజమండ్రి పుష్కరాల రేవులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ మూవీ సంబరాలు శనివారం అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 40 పడవలతో గోదావరి నదిలో ‘CHIRU’ ఆకారంలో విన్యాసాలు చేస్తూ సందడి చేశారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. గోదావరి తీరం మెగా నామస్మరణతో మారుమోగింది.


