News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో <<15578307>>భాస్కర్ అనే వ్యక్తిని<<>> అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 15, 2025
గొప్ప మానవతావాది సూపర్ స్టార్ కృష్ణ: YS జగన్

AP: తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ అని YCP అధినేత వైఎస్ జగన్ కొనియాడారు. ‘ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అని ట్వీట్ చేశారు.
News November 15, 2025
‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
మైనర్ డ్రైవింగ్ తీవ్ర నేరం: కర్నూలు ఎస్పీ

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం తీవ్ర నేరమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి–అక్టోబర్ మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను, యజమానులను ఆయన సూచించారు. రెండోసారి పట్టుబడితే ₹5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు.


