News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 21, 2025
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్ ఎంటర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.
News November 21, 2025
NRPT: స్థానిక ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 21, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2,803 మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రూ.లక్ష లోపు రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2,803 మంది చేనేత కార్మికులకు రూ.23.25 కోట్ల రుణమాఫీ కానుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2024 మధ్య తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.


