News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News March 16, 2025

నేడు మాస్టర్స్ లీగ్ ఫైనల్

image

వివిధ దేశాల దిగ్గజ విశ్రాంత క్రికెటర్లు ఆడుతున్న మాస్టర్స్ లీగ్ తుది దశకు చేరుకుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు సచిన్, విండీస్‌కు లారా కెప్టెన్లుగా ఉన్నారు. గ్రూప్ దశలో ఐదింట నాలుగు గెలిచిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు సచిన్, యువీ.. అటు సిమన్స్, డ్వేన్ స్మిత్ మెరుపులు మెరిపిస్తుండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.

News March 16, 2025

రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

image

ఇంటర్ ప్రథమ, 2వ సంవత్సరం విద్యార్థులకు ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. గురువారంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం, శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 29,405 మందికి 28,901 మంది హాజరు కాగా 503 మంది గైర్హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి జరగనుంది. ఇందుకోసం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళ కాలేజీలో ఏర్పాట్లు చేశారు.

News March 16, 2025

తిరుపతిలో దారుణం..!

image

తిరుపతిలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి క్రిందకు తోసేసింది. దీంతో 14 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థినికి గోప్యంగా చికిత్సను స్కూల్ యాజమాన్యం అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!