News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు  

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు‌ అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 26, 2025

24 గంటల్లో 62 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా అధికారులు ప్రకటించారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణ గాజాలోని, ఖాన్ యూనిస్‌లో పునరావాస కేంద్రాలపై జరిగిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు చనిపోయారని పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి హమాస్ విజ్ఞప్తి చేసింది.

News March 26, 2025

మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నా: నటాషా

image

హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నట్లు నటాషా తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమ మాత్రమే కాదు పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. మళ్లీ మోడలింగ్, నటనను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

News March 26, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

∆} కల్లూరును మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి ∆} ఖమ్మం: కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ∆} ఖమ్మం: సీతారాముల కళ్యాణానికి 197 ప్రత్యేక బస్సులు ∆} నేలకొండపల్లి: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య ∆} ‘సత్తుపల్లి MLA గారూ మా సమస్యలు ప్రస్తావించండి’ ∆} లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ బీభత్సం ∆} సదాశివునిపేటలో చోరీ.. రూ.2.35లక్షలు చోరీ ∆} ఖమ్మం: బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

error: Content is protected !!