News March 18, 2025
హనుమకొండ: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.వీరంతా సెల్ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 12,010 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News December 17, 2025
కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.
News December 17, 2025
గర్భిణులకు ఫోలిక్ యాసిడ్తో ఎంతో మేలు

గర్భం దాల్చాలనుకునే మహిళలు/ గర్భం దాల్చిన మహిళలకు ఫోలిక్ యాసిడ్ తప్పనిసరని వైద్యులు చెబుతుంటారు. ఫోలిక్ యాసిడ్ని విటమిన్ B9 అని కూడా అంటారు. దీన్ని రోజూ తీసుకుంటే బిడ్డ న్యూరల్ ట్యూబ్, మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సాయపడుతుంది. పిల్లలు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టడం, గర్భస్రావం, ప్రీఎక్లాంప్సియా, హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్లు, అల్జీమర్స్ రాకుండా ఫోలిక్ యాసిడ్ సాయపడుతుంది.
News December 17, 2025
సత్యసాయి: బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

పుట్టపర్తికి చెందిన ర్యాపిడో ఆటో డ్రైవర్ సాయి కుమార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరుపతిలో గత నెల 3న హాస్టల్ నుంచి లగేజ్ తరలిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ పే ద్వారా నగదు చెల్లించగా ఆ నంబర్ సేవ్ చేసుకుని ప్రేమించమని వేధించేవాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ తెలిపారు.


