News March 1, 2025
హనుమకొండ: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

మార్చి 21 నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News January 5, 2026
రాష్ట్రంలో 220 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు JAN 8 నుంచి 22వరకు అప్లై చేసుకోవచ్చు. MD/MS/DNB/DM/MCH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కేవలం ఏపీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. <
News January 5, 2026
NLG: బ్యాలెట్ వైపే మొగ్గు!

మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే 2014లో ఈవీఎంలతో, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
News January 5, 2026
హ్యాపీ హార్మోన్స్ కోసం ఇలా చేయాలి

ఎమోషన్స్ బావుండటానికి, రోజంతా హ్యాపీగా ఉండటానికి శరీరంలో సెరటోనిన్ హార్మోన్ సరిపడినంత ఉండటం ముఖ్యం. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. పీచు పదార్థాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ ఎండలో కాసేపు ఉండటం, ధ్యానం చేయడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.. ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ ఫిష్‌లో ఎక్కువగా ఉంటుంది.


