News April 14, 2025
హనుమకొండ: ‘పిల్లలపై నిరంతరం నిఘా ఉంచండి’

జిల్లాలో మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Similar News
News September 17, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
News September 17, 2025
PDPL: ‘సమాజం బలంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి’

సమాజం బలంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా, ఆత్మ విశ్వాసంతో ఉండాలని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగిన స్వస్తి నారి- సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో MP పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
News September 17, 2025
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.