News March 12, 2025
హనుమకొండ: పూడికతీత వేగంగా జరగాలి: కలెక్టర్లు

భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్య శారద అన్నారు. భద్రకాళి చెరువులో పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 9, 2026
మంగళగిరిలో మేఘాలయ బృందం పర్యటన

‘ఎనీమియా ముక్త్ భారత్’ పరిశీలన ఆంధ్రప్రదేశ్‌లో’ ఎనీమియా ముక్త్ భారత్’ అమలు తీరును పరిశీలించేందుకు మేఘాలయ NHM ఉన్నతాధికారుల బృందం సోమవారం మంగళగిరిలో పర్యటించింది. స్థానిక ఉన్నత పాఠశాల, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రక్తహీనత నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంలో AP అగ్రస్థానంలో ఉన్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని అధికారులు తెలిపారు. రేపు అంగన్వాడీ, PHCలను ఈ బృందం సందర్శించనుంది.
News February 9, 2026
రాష్ట్రస్థాయిలో కాకినాడ సిటీకి మూడో ర్యాంకు

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నియోజకవర్గాల ర్యాంకుల్లో కాకినాడ సిటీ సత్తా చాటింది. వివిధ అంశాల్లో 77 ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకోగా, 92 స్కోరుతో రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. A+ కేటగిరీలో నిలవడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా కాకినాడకు దక్కిన గౌరవంగా దీన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.
News February 9, 2026
BREAKING: HYDలోని హాస్టళ్లలో తనిఖీలు

నగరంలోని PG హాస్టళ్లపై ఖాకీ నిఘా మొదలైంది. ‘ఇకపై ఆటలు సాగవు.. నిబంధనలు పాటించాల్సిందే’ అంటూ మియాపూర్ పోలీసులు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఎఫ్ఎస్‌ఎస్ఏఐ సర్టిఫికెట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ సెక్టార్ వారీగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.


