News October 24, 2024
హనుమకొండ: బాలికపై సీఐ రవికుమార్ లైంగిక దాడికి యత్నం
మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం చేసిన సీఐపై పోక్సో కేసు నమోదు చేశారు. హనుమకొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మైనర్ బాలికపై సీఐ రవికుమార్ పలుమార్లు లైంగిక దాడికి యత్నించారని కాజీపేట పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రవికుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. గతంలో వరంగల్ మామునూరు పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేశారు.
Similar News
News November 10, 2024
పరకాల: కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు
హనుమకొండ జిల్లా కేంద్రానికి వచ్చిన కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్ నాయక్, ముఖ్య నేతలు కలిశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యేలు వివరించారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింతం సదానందం, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
News November 10, 2024
కులగణన సర్వేలో తప్పులు దొర్లితే సిబ్బందిపై చర్యలు: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కుటుంబాలకు అనుగుణంగా ఎన్యుమరేటర్‌లను నియమించమన్నారు. సర్వే ఫారంలో ఉన్న 75 ఖాళీలను పూర్తిగా నింపి కులగణన సమగ్రంగా ఉండేలా ఎన్యుమరేటర్‌లు చూడాలన్నారు.
News November 10, 2024
HNK: M.Sc కెమిస్ట్రీ తొమ్మిదో సెమిస్టర్ పరీక్ష టైం టేబుల్
కాకతీయ విశ్వవిద్యాలయ M.Sc (5 year integrated) కెమిస్ట్రీ తొమ్మిదో సెమిస్టర్ పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య ఓ ప్రకటనలో విడుదల చేశారు. మొదటి పేపర్ నవంబర్ 26న, రెండో పేపర్ 28న, మూడో పేపర్ 30న, నాల్గో పేపర్ డిసెంబర్ 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.