News March 8, 2025
హనుమకొండ: బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి: కలెక్టర్

బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని హనుమకొండ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై ఆమె చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
Similar News
News March 19, 2025
పదవ తరగతి పరీక్షకు 124 మంది గైర్హాజరు: డీఈవో

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,670 మంది హాజరైనట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 46 మంది హాజరుకావాల్సి ఉండగా 20 మంది హాజరైనట్లు తెలిపారు.
News March 19, 2025
ములుగు: మంత్రి సీతక్కకు కొత్త చిక్కులు!

మంత్రి సీతక్కకు కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే సీతక్క పేరుతో వాహనాలకు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ములుగు జిల్లాలో కొందరు వ్యక్తులు మంత్రి సీతక్క వ్యక్తిగత పీఏ, పీఆర్‌వోలమంటూ మండల స్థాయి అధికారుల వద్దకు వెళ్లి చెబుతున్నారని సమాచారం. అలాంటి వారు ఎవరూ లేరని, క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు అశోక్ హెచ్చరించారు.
News March 19, 2025
ఏప్రిల్ నుంచి ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే

దేశంలో APR నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ 4% పెంపు ప్రకటన చేయగా నిన్న టాటా మోటార్స్ కూడా 3% వరకు పెంచుతామంది. మిగతా ఆటో బ్రాండ్స్ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త రేట్లతో సేల్స్‌కు రెడీ అవుతున్నాయి. ఒకవేళ మీకు రాబోయే కొన్ని వారాల్లో కారు కొనే ఆలోచన ఉంటే ఈనెల 31లోపు తీసుకుంటే ఎక్స్‌ట్రా చెల్లింపు తప్పుతుంది. డెలివరీ తీసుకొనే రోజు ఉన్న ధరనే కంపెనీ పరిగణిస్తుందని మరువొద్దు.