News July 30, 2024
హనుమకొండ: బైక్ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

హనుమకొండ జిల్లా మామునూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నుండి మిర్చి లోడుతో ఖమ్మం వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట మండలం సింగారం గ్రామానికి చెందిన అఖిల్ (20)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 17, 2025
వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
News December 17, 2025
వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


