News February 26, 2025

హనుమకొండ: మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: డీసీపీ 

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫిబ్రవరి నెలలో నమోదైన 9 గంజాయి కేసులతో పాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.

Similar News

News February 26, 2025

తాళ్లపూడి: గల్లంతై చనిపోయింది వీరే..!

image

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం పండగ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నదీ స్నానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతై చనిపోయారు. మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. 20 సంవత్సరాలు దాటకుండానే ఆ యువకులు చనిపోయారు. మృతదేహాల వద్ద వారి కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఆల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

News February 26, 2025

కాంగోలో వింతవ్యాధి: సోకిన 48 గంటల్లోపే మరణం

image

కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్‌బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలివుండటంతో WHO సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఔట్‌బ్రేక్ మొదలైంది. 419 మందికి సోకింది. 53 మందిని చంపేసింది.

News February 26, 2025

క్రికెటే నా ప్రాణం: రోహిత్‌ శర్మ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్‌మ్యాన్ వివరించారు.

error: Content is protected !!