News April 4, 2025

హనుమకొండ: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News October 18, 2025

కామారెడ్డి: రక్తదానం గొప్ప దానం

image

ప్రాణాలను రక్షించడంలో రక్తదానం గొప్ప దానమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పాల్గొనాలని KMR జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మత్స్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. జిల్లా మత్స్య శాఖ అధికారి పి.శ్రీపతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

News October 18, 2025

కృష్ణా: విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడే

image

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి చేర్చిన కవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడు. 1895 సెప్టెంబర్ 10న ఉమ్మడి కృష్ణా (D) నందమూరులో జన్మించిన విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యంలో అజరామరుడయ్యారు. 1976 అక్టోబర్ 18న ఆయన తుదిశ్వాస విడిచినా, ఆయన సృష్టించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి సాహిత్య సృష్టులు తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

News October 18, 2025

వలిగొండ: ట్రాక్టర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

image

వలిగొండ మండలం వర్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగారం సబ్‌ సెంటర్‌ పరిధిలోని వర్కట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న సుజాత స్కూటీపై వలిగొండ వైపు వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుజాత అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.