News January 10, 2026
హనుమకొండ: రూ.7.85 లక్షల విలువైన బంగారం చోరీ

కేయూ పీఎస్ పరిధిలో పట్ట పగలే దొంగతనం జరిగింది. శివసాయి కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.7.85 లక్షల విలువైన బంగారం దోచుకెళ్లినట్లు బాధితుడు గోపాల కృష్ణ తెలిపారు. తన అమ్మాయి కాలేజ్ ఫీజు కోసం దాచుకున్నట్లు చెప్పారు. కేయూ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని డిసీపీ, ఏసీపీ, సీసీఎస్ పోలీసులు పరిశీలించారు.
Similar News
News January 22, 2026
ఖమ్మం: మున్సిపల్ పోరు.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అటు బీఆర్ఎస్ సైతం సర్వేలతో పాటు వార్డుల్లో పట్టున్న నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
News January 22, 2026
నంద్యాల: బస్సు, లారీ దగ్ధంపై అనుమానాలు!

నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో మంటలు చెలరేగి బస్సు, లారీ పూర్తిగా కాలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పేలుడు సంభవించే పదార్థాలు, వస్తువులు తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ AR BCVR ట్రావెల్స్ బస్సు లగేజీ బాక్స్‌లో గ్యాస్ స్టవ్‌ను తీసుకెళ్తున్నట్లు బయటపడింది. ఎదురెదురుగా బస్సు, లారీ ఢీకొనగానే వాటి బ్యాటరీలు పేలి భారీ మంటలు వ్యాపించాయనే వాదన మరోపక్క వినిపిస్తోంది.
News January 22, 2026
రేణిగుంట మీదుగా మరో ప్రతిష్ఠాత్మక రైలు.!

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు రేణిగుంట మీదుగా వెళ్లనుంది. రేణిగుంటలో 3:30 AMకి బయలుదేరి చర్లపల్లికి 4:30 PMకు చేరుకోనుంది. రాత్రి శ్రీవారి దర్శనం అనంతరం పగలు ప్రయాణం చేసేవారికి చాలా ఉపయోగపడనుంది.


