News February 23, 2025
హనుమకొండ: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 24, 2025
రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

AP: ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(VTPS) స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73MU విద్యుత్ ఉత్పత్తే అధికం. ఇతర థర్మల్ కేంద్రాల్లో 123.055MU, హైడల్ 9.411MU, తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. ఏపీజెన్కో చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని సంస్థ MD కేవీఎస్ చక్రధరబాబు తెలిపారు.
News February 24, 2025
NTR: జిల్లాలో జరిగిన చారిత్రక ఘట్టంపై గ్రూప్-2 పరీక్షలో ప్రశ్న

ఆదివారం జరిగిన గ్రూప్-2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ పరీక్షలోని 1వ పేపర్లో విజయవాడలో జరిగిన చారిత్రక ఘట్టంపై APPSC అభ్యర్థులను ప్రశ్న అడిగింది. విజయవాడలో “నెడుంబ వసతి” అనే జైన ఆలయాన్ని నిర్మించిన మహిళ అయ్యన మహాదేవి కాగా ఆమె ఎవరి పట్టమహిషి అనే ప్రశ్నను APPSC అభ్యర్థులను అడిగింది. కాగా సాయంత్రం వెలువడిన ప్రాథమిక కీలో ఈ ప్రశ్నకు సమాధానం “కుబ్జ విష్ణువర్ధునుడిగా” APPSC ప్రకటించింది.
News February 24, 2025
ఏలూరు: గ్రూప్-2 పరీక్షకు 7,759 మంది హాజరు

ఏలూరులో నిన్న నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 6 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది హాజరుకాగా, 534 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్స్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 4,415 మంది అభ్యర్థులకు గాను 3,878 మంది అభ్యర్థులు హాజరుకాగా 537 మంది గైర్హాజరయ్యారు.