News April 5, 2025

హనుమకొండ: విషాదం.. బర్త్ డే మరుసటి రోజే మృతి

image

హన్మకొండ జిల్లాకు చెందిన వేద పాఠశాల విద్యార్థి <<15990250>>నిర్మల్(D)లో మృతి<<>> చెందినవిషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. శాయంపేటకు చెందిన మణికంఠ 2ఏళ్ల క్రితం బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. అయితే నిన్న గోదావరినదికి హారతి ఇవ్వడానికి నదిలోని బోరుబావి మోటార్‌ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతి చెందాడు. కాగా, మణికంఠ బర్త్ డే తర్వాతి రోజే ఈఘటన జరిగింది. మణికంఠ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 20, 2025

శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

image

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.

News November 20, 2025

గృహ నిర్మాణాల్లో ప్రజల సంతృప్తే గీటురాయి: కలెక్టర్

image

గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్‌లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవడం ఒక కల అని, దానిని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. వివిధ స్థాయిలలో ఉన్న గృహా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

News November 20, 2025

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు: కలెక్టర్

image

పేదల ఆకలిని తీర్చేందుకే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా తెలిపారు. పటమట హైస్కూల్ రోడ్డులోని అన్న క్యాంటీన్ ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ.5 చెల్లించి, అక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు. ఆహారం పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైనింగ్ ఏరియా, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాల పట్టిక, తాగునీటిని సరఫరాను చేశారు.