News February 26, 2025
హనుమకొండ: వేయి స్తంభాల ఆలయంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేయి స్తంభాల దేవాలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ డివిజన్ పోలీసులు భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ బందోబస్త్ ఏర్పాటుకు సంబంధించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.
Similar News
News December 13, 2025
తిరుపతి: SVకాలేజీలో అన్యమత ప్రచారం.. ప్రిన్సిపల్ ఏమన్నారంటే.!

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో <<18550600>>అన్యమత ప్రచారం<<>>పై Way2Newsలో వచ్చిన కథనంపై ప్రిన్సిపల్ వై.ద్వారకానాథ్ రెడ్డి స్పందించారు. సంబంధిత లెక్చరర్ నుంచి వివరణ తీసుకున్నామన్న ఆయన.. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందికి ఆదేశాలు ఇస్తామన్నారు.
News December 13, 2025
మాటలతో యుద్ధాలు గెలవలేం: CDS అనిల్ చౌహాన్

దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్కు పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన టార్గెట్, చర్యలే విజయాన్ని అందిస్తాయని అన్నారు. సైన్యం నిబద్ధతలోనే భారత్ బలం దాగి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామన్నారు.
News December 13, 2025
భూపాలపల్లి: రెండో విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

పలిమెల, భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో రెండో విడత ఎన్నికల పోలింగ్కు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.


