News February 25, 2025
హనుమకొండ: వైన్స్, బార్, రెస్టారెంట్లు బంద్: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 27 వరకు హనుమకొండ జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్, రెస్టారెంట్లు, కల్లు డిపోలు మూసి వేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 25, 2025
పరిగిలో రోడ్డు ప్రమాదం (UPDATE)

పరిగి శివారులోని HYD బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు బైకులను కంటైనర్ లారీ ఢీకొనగా ఓ బైక్పై ఉన్న శ్రీశైలం (20)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పరిగి మండలానికి చెందిన రంగంపల్లి గ్రామానికి చెందిన యువకుడిగా ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. మరో బైక్పై ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామన్నారు.
News February 25, 2025
గిద్దలూరు: వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

గిద్దలూరులోని పీఆర్ కాలనీలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాబడిన సమాచారం మేరకు అర్బన్ సీఐ సురేశ్ వ్యభిచార గృహంపై దాడికి దిగారు. ఇద్దరు విటులను, మహిళలను, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విటులకు కౌన్సిలింగ్ ఇచ్చి యువకులపై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు.
News February 25, 2025
పెట్రోల్ బంకుల్లో మోసాలు.. DGP హెచ్చరిక

AP: ఎలక్ట్రానిక్ చిప్లు టాంపర్ చేసి రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని 73 పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల వాహనాలకు తక్కువ పెట్రోల్, డీజిల్ కొడుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DGP హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.