News November 14, 2024
హనుమకొండ: శివయ్య శిరస్సుపై జాబిల్లి
హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు లింగం శ్రీ సిద్దేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. సాయంకాలం సంధ్యా సమయంలో కార్తీక పౌర్ణమి ఘడియల్లో శివయ్య శిరస్సుపై జాబిల్లి విరజిల్లుతున్నట్లు కనిపించింది. పలువురు భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.
Similar News
News December 3, 2024
దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగవైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
News December 3, 2024
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న HNK NPDCL కార్యాలయం
హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.
News December 2, 2024
సిద్దేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్ధేశ్వరాలయంలో మార్గశిర మాసం సోమవారం పోలీ స్వర్గం సందర్భంగా సిద్ధేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని పలు ఆలయాల్లో నేడు భక్తుల సందడి నెలకొంది.