News November 19, 2024

హనుమకొండ సీఎం సభలో అర్జున అవార్డు గ్రహీతలు

image

హనుమకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభలో బాక్సింగ్ ఒలింపిక్స్ పోటీల్లో అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్, షూటింగ్‌లో ఒలింపిక్స్ పోటీల్లో అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీతలతో హన్మకొండ జిల్లాకు చెందిన క్రీడాకారులు కొద్దిసేపు మాట్లాడారు.

Similar News

News December 8, 2024

ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈ రోజు ఆదివారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News December 8, 2024

పరకాల: రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి మండలానికి చెందిన వేముల సుమన్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో రేగొండ వైపునకు వెళుతున్నారు. ఈ క్రమంలో పరకాల సమీపంలో శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమన్ కూతురు సాత్వికతో పాటు పలువురు గాయపడ్డారు. సాత్వికను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News December 7, 2024

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఎంపీ కావ్య

image

వరంగల్ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. టెక్స్‌టైల్ పార్క్ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో నిత్యం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.