News March 4, 2025
హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.
Similar News
News December 9, 2025
పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా రామారావు

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.వి.జి. రామారావును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. కాగా, పల్నాడు జిల్లా డీఈఓగా పనిచేస్తున్న చంద్రకళను కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేశారు.
News December 9, 2025
విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.
News December 9, 2025
KNR: నకిలీ బ్యాలెట్ పత్రాలు.. సర్పంచ్ అభ్యర్థి సహా నలుగురిపై కేసు

మానకొండూరు మండలం చెంజర్లలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నకిలీ నమూనా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేసినందుకు సర్పంచ్ అభ్యర్థి గడ్ది రేణుక(కత్తెర గుర్తు)తో సహా నలుగురిపై కేసు నమోదైంది. వీరు ఫుట్‌బాల్ గుర్తు అభ్యర్థి సీరియల్ నంబర్‌ను తప్పుగా ముద్రించి, NOTA స్థానంలో సరైన సీరియల్ నంబర్‌ను ఉంచి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.


