News November 7, 2025

హనుమాన్ చాలీసా భావం – 2

image

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
ఇది ఆంజనేయుడి గొప్పదనాన్ని వివరిస్తుంది. హనుమాన్ రాముడికి నమ్మకమైన దూత(రామదూత). ఆయన బలం కొలవలేనిది, అపార శక్తిమంతుడు(అతులిత బలధామా). ఆయన అంజనీదేవి కుమారుడు(అంజనిపుత్ర), వాయుదేవుని పుత్రుడు(పవనసుత). శ్రీరాముడి విజయం, ధర్మ స్థాపనలో హనుమంతుని పాత్ర కీలకం. ఆయనను స్మరిస్తే శక్తి, విజయం లభిస్తాయి. <<-se>>#HANUMANCHALISA<<>>

Similar News

News March 6, 2026

రక్త పరీక్షతో అల్జీమర్స్‌ను ముందే గుర్తించొచ్చు: వైద్యులు

image

ప్రస్తుతం చాలా మంది బాధపడే అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధిని రక్త పరీక్ష ద్వారా ముందే గుర్తించవచ్చని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. ‘అల్జీమర్స్ లక్షణాలు కనిపించడానికి 20 ఏళ్ల ముందే మెదడులో మార్పులు మొదలవుతాయి. వీటిని గుర్తించేందుకు రక్తంలోని ‘p-tau217’ ప్రొటీన్ ద్వారా వ్యాధి ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో ముందే అంచనా వేయవచ్చు. ఇది వ్యాధి ముదరకముందే చికిత్స అందించడానికి తోడ్పడుతుంది’ అని సూచిస్తున్నారు.

News March 6, 2026

మిస్సైల్స్ అటాక్స్‌కు అవకాశం.. ప్రజలకు మెసేజ్‌లు

image

యుద్ధంతో గల్ఫ్ కంట్రీ దుబాయ్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మిస్సైళ్ల దాడులకు అవకాశం ఉందంటూ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవాళ్లు వెంటనే స్థానికంగా షెల్టర్లు తీసుకోవాలని ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసింది.

News March 6, 2026

సివిల్స్ ఫలితాలు విడుదల

image

సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాతి ర్యాంకుల్లో వరుసగా రాజేశ్వరి సువే, ఆకాన్ష్, రాఘవ్, ఇషాన్ భట్నాగర్ ఉన్నారు. మొత్తంగా 1,087 పోస్టులకు పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈసారి IASకు 180, IFSకు 55, IPSకు 150, గ్రూప్-A సెంట్రల్ సర్వీసెస్‌కు 507, గ్రూప్-B సర్వీసెస్‌కు 195 మంది ఎంపికయ్యారు.