News April 11, 2025
హనుమాన్ జయంతి..భద్రతా చర్యలపై SP సమీక్ష

హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం ఆయన స్వయంగా రంగంలోకి దిగి, ఆయా శాఖల అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ర్యాలీ నిర్వహించే ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.
Similar News
News October 15, 2025
ఆ నాలుగు మండలాల్లోనే వర్షపాతం నమోదు.!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కూసుమంచి మండలంలో 4.8, తల్లాడ మండలంలో 2.4, రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం రూరల్ మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. కాగా ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News October 15, 2025
దారులు వేరైనప్పుడు KCR ఫొటో పెట్టుకోవడం కరెక్ట్ కాదు: కవిత

TG: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జాగృతి జనం బాట’ చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ‘ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా KCR పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను వేరే తొవ్వ వెతుక్కుంటున్నా. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టకుండా జయశంకర్ ఫొటోనే పెట్టాం’ అని చెప్పారు.
News October 15, 2025
నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

నల్గొండలో మైనర్పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.