News April 12, 2025
హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్రకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
Similar News
News November 23, 2025
ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.
News November 23, 2025
సత్యవేడు: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms-research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News November 23, 2025
హనుమకొండ: బహుమతులను అందజేసిన మంత్రి, ఎమ్మెల్యేలు

11వ తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


