News May 20, 2024

హన్మకొండలో తీన్మార్ మల్లన్న సుడిగాలి పర్యటన

image

ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హన్మకొండలోని ఆర్ట్స్&సైన్స్ కాలేజ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, కేయూ గ్రౌండ్&కేయూ కామన్ మెస్, స్టడీ రూమ్‌లలో మార్నింగ్ వాక్ ద్వారా విస్తృతంగా పర్యటించారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్, సుధాకర్ తదితరులున్నారు.

Similar News

News November 22, 2025

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

image

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News November 21, 2025

నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

image

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్‌ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

News November 21, 2025

బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. 6 నుంచి 14, 15 నుంచి 19 ఏళ్ల బడి బయటి పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, టెక్స్‌టైల్ పార్కుల్లో పనిచేసే కుటుంబాల పిల్లలకు పని ప్రదేశంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.